డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. అన్నీ దొంగ లెక్కలు : భట్టీ


తెలంగాణలో అధికార పార్టీ తెరాస, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ల మధ్య డబుల్ బెడ్ రూమ్ వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని చూపిస్తామన్న ప్రభుత్వం అన్నీ దొక్కలెక్కలు చూపించని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టీ విక్రమార్క్ ఫైర్ అయ్యారు. ఈ ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలో సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి మీడియాతో భట్టీ.

నాంపల్లిలో 1,824 ఇళ్లు కట్టామని చెప్పారు, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. జూబ్లీహిల్స్‌లోని రెండు ప్రాంతాల్లో 226 ఇళ్లు కట్టినట్టు చెప్పారు…ఆ జాబితాలోనూ అనేక అవకతవకలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రతి అర్బన్‌ నియోజకవర్గానికి 10వేల చొప్పున రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని 2016-17లోనే సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కట్టింది లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2.4లక్షల ఇళ్లు ఎప్పుడు కడతారని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ప్రభుత్వం అన్నీ దొంగ లెక్కలు చూపిస్తోందని భట్టీ విమర్శించారు.