వాట్సాప్’లో సరికొత్త ఫీచర్.. !

వాట్సాప్ సరికొత్త డిలీట్ ఆప్షన్ ని తీసుకొచ్చింది.వాట్సాప్‌లో పొరపాటున పంపిన వీడియోలను, టెక్స్‌మెస్సేజ్‌లు, ఇమేజ్‌లు, ఫైల్స్‌, ఎమోజీలను ఇలా ఏదైనా నియమిత సమయంలో అవతలి వాళ్ల అకౌంట్ నుంచి కూడా డిలీట్‌ చేసే అవకాశం ఇప్పటికే ఉంది. ఆ సమయం తర్వాత ‘డిలీట్‌ ఫర్‌ ఆల్‌’ ఆప్షన్‌ పని చేయదు. దీనిని అధిగమించడానికి మరో ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ కసరత్తులు చేస్తోంది.

దీని ద్వారా అవతలి వాళ్ల వాట్సాప్‌కు మనం పోస్టు చేసిన సమాచారం ఎప్పుడు డిలీట్‌ చెయ్యాలా? అనేది ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా చాట్‌ నుంచి బయటకు వస్తే ఆటోమేటిగ్గా మీరు పంపిన డేటా అంతా డిలీట్‌ అయ్యేలా కూడా ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సరికొత్త డిలీట్ ఫీచర్ ని త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.