అమిత్ షాతో సీఎం జగన్ రెండోసారి భేటీ
ఢిల్లీ టూర్ లో ఉన్న ఏపీ సీఎం జగన్ మంగళవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 నిమిషాల పాటు వీరి మధ్య చర్చ జరిగింది. అయితే మరికొద్దిసేపట్లో సీఎం జగన్ మరోసారి అమిత్ షాతో భేటీ కానున్నారు. నిన్నటి సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. నిన్న సమయభావం వలన చర్చ మధ్యలోనే ముగిసింది. నిన్న ప్రస్తావించిన అంశాలపైనే ఈరోజు సీఎం జగన్ మరింత వివరణ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ఏపీని కేంద్రం పెద్దన్నలా ఆదుకోవాలని సీఎం జగన్ అమిత్ షాని కోరినట్టు తెలుస్తోంది. అమరావతి ల్యాండ్ స్కామ్, పోలవరం, కరోనా కట్టడి అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులని విడుదల చేయాలని కోరినట్టు సమాచారమ్. ఇటీవల ఏపీలో జరుగుతున్న హిందూ దేవాలయాలపై దాడుల అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. మొత్తంగా.. సీఎం జగన్ కి కేంద్ర ప్రభుత్వం ఇంత ప్రాధాన్యతని ఇచ్చి.. ఒకటి రెండు సార్లు భేటీకి అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని చెప్పవచ్చు.