మూడేళ్ల టాలీవుడ్ డ్రగ్ కేసులో షాకింగ్ నిజాలు

మూడేళ్ల క్రితం (2017) టాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్‌ శాఖ ఒక ఎస్పీ, ఒక ఇన్‌స్పెక్టర్‌తో సిట్‌ వేసింది. మొత్తం 72 మందిని సిట్ విచారించింది. వీరిలో 60 మంది బయట వ్యక్తులు, 12మంది సినిమా వాళ్లు ఉన్నారు. ఆ తర్వాత ఈ కేసు సలైంట్ మోడ్ లోకి వెళ్లింది. తాజాగా సుపరిపాలన వేదిక సహ చట్టం ద్వారా ఈ కేసుకు సంబంధించిన పురోగతిపై వివరాలు అడగ్గా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కేసులో మొత్తం 12 డ్రగ్స్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. అందులో 8 కేసుల్లోనే ఎక్సైజ్‌శాఖ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై ఎక్సైజ్‌శాఖ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సామాన్యుల పేర్లని మాత్రమే ఛార్జ్ షీట్లలో పేర్కొన్నారు. ఏ ఒక్క సినీ ప్రముఖుల పేర్లు అందులో లేవు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డ్రగ్ కేసుపై అనుమానాలు తలెత్తుతున్నాయ్. కావాలనే ఈ కేసుని నీరు గార్చారని, నిందుతులని వదిలేశారని చెప్పుకొంటున్నారు. అంతేకాదు.. టాలీవుడ్ డ్రగ్ కేసుతో పలువురు బాలీవుడ్ ప్రముఖులకి సంబంధాలున్నాయని తెలుస్తోంది.