బాలు డిశ్చార్జ్ ఎప్పుడంటే ?
గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాని జయించారు. కరోనా వైరస్ సోకడంతో ఆగస్టు 5న బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
బాలుకి ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఎంజీఎం వైద్యులు జాగ్రతగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయనున్నారు. అయితే బాలు కోలుకున్నారు. ఇటీవల వ్యాయామం చేస్తున్నారు, ఆహారం తీసుకుంటున్నారు. నలుగురితో మాట్లాడుతున్నారుని బాలు తనయుడు ఎస్పీ చరణ్ వీడియో మెసేజ్ లు అందిస్తున్నారు. అంతేకాదు.. బాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావాలని కూడా అనుకుంటున్నారట. బహుశా.. ఈ వారమో, వచ్చే వారమో బాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.