అందంతో చంపేస్తోంది.. అరెస్ట్ చేయండి

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి నటిగా రుజువు చేసుకొంది. దీనికి కాస్త గ్లామర్ తోడైతే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోద్ది అనే కామెంట్స్ వినిపించాయి. ఈ కామెంట్స్ ని ఆమె సీరియస్ గా తీసుకొన్నంటుంది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది. ఫలితం ఎలా సంగతి ప్రక్కన పెడితే.. లావణ్య అందాలని చూసి కుర్రోళ్లు తట్టుకోలేకపోతున్నారు. అందంతో చంపేస్తున్న లావణ్యని అరెస్ట్ చేయమని కోరుతున్నారు.

లావణ్య నటించిన తాజా చిత్రం ‘ఇంటిలిజెంట్’. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దిగిన ఫోటోను త‌న సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో పోస్ట్ చేసింది..దీనికి వరుణ్‌ అనే అభిమాని ఆమెకు ట్యాగ్ చేస్తూ, ‘అందంగా ఉండటం నేరమైతే ఇప్పటికిప్పుడే లావణ్యను అరెస్ట్‌ చేయండి. ఆమె తన అందంతో చంపేస్తోంది’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై లావణ్య రిప్లే ఇస్తూ.. ‘హా హా.. మా నాన్న లాయర్’ అంటూ స్పందించింది. దీంతో.. లావణ్య అందాల టాపిక్ హాట్ టాపిక్ గా మారింది.