‘ఆచార్య’ కోసం చరణ్ ఫోటో షూట్


కరోనా లాక్‌డౌన్ తో సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడో షూటింగులకు అనుమతులు ఇచ్చినా.. పెద్ద సినిమాలేవీ ఇప్పటి వరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. అక్టోబర్ లో బ‌డా చిత్రాలు సెట్స్‌పైకి వెళ్ల‌బోతున్నాయి. అందులో మెగాస్టార్ ‘ఆచార్య’ ఒకటి. కొ‌రటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ కథానాయిక. రామ్ చరణ్ ఓ కీలక కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా రామ్ చరణ్ పై ఫోటో షూట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.చ‌ర‌ణ్ గెట‌ప్‌ని ఫైన‌లైజ్ చేయ‌డానికి ఈ ఫొటో షూట్ ని ఉప‌యోగించుకోబోతున్నారు. ఇప్ప‌టికే చ‌ర‌ణ్ ఎలాంటి గెట‌ప్‌లో క‌నిపిస్తే బాగుంటుందో, కొర‌టాల ఊహించి, కొన్ని స్కెచ్‌లు త‌యారు చేయించాడ‌ట‌. అందులో ఒక‌దాన్ని ఫిక్స్ చేసి, ఆ గెట‌ప్ కి త‌గిన‌ట్టుగా చ‌ర‌ణ్ మార‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ కూడా ఖాళీగా ఉన్నారు. నవంబర్ లోనే ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ అని క్లారిటీ వచ్చేసింది. నవంబర్ లో అలియా భట్ కాల్షీట్స్ ఇవ్వడంతో.. అప్పుడే షూటింగ్ మొదలెడదామని జక్కన ఫిక్సయినట్టు తెలిసింది.

ఈ లోపు ‘ఆచార్య’ సినిమాలోని తన పాత్రని ఫినిష్ చేయబోతున్నాడు చరణ్. ఇందులో చ‌ర‌ణ్ పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో రానుంది. చ‌ర‌ణ్ పక్క‌న ర‌ష్మిక‌ని క‌థానాయిక‌గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ షెడ్యూల్ లోనే చిరు- చ‌ర‌ణ్‌ల‌తో పాటు చిరు-ర‌ష్మిక‌ల‌పై కొన్ని స‌న్నివేశాల్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. మరికొద్దిరోజులు ఆలస్యమైతే.. చరణ్, రస్మిక ఇద్దరూ బిజీ అవుతారు. రస్మిక పుష్ప సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతారు. ఈలోపు ఆచార్య సినిమాకు సంబంధించిన చరణ్, రస్మిక పార్ట్ ని పూర్తి చేయబోతున్నాడు కొరటాల.