పరారీలో దీపిక, రకుల్ !?
డ్రగ్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వీరికి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీపికా పదుకొనె, ఆమె మేనేజర్ కరిష్మా, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ లకి నోటీసులు అందాయి. వీరిలో దీపికా, కరిష్మా, శ్రద్దా, సారాలని ఈ నెల 24న విచారణకు హాజరుకావాలని, 25న దీపిక, ఆమె మేనేజర్ కరిష్మాలని విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది.
అయితే ఈ నోటీసులు అందిన వారిలో దీపిక, రకుల్ ప్రస్తుతం షూటింగ్ లో ఉన్నారు. దీపికా షూటింగ్ కోసం గోవాకి వెళ్లింది. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా షూటింగ్ కోసం వికారాబాద్ అడువులకి వెళ్లింది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-రకుల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఆమెకు అక్కడ సిగ్నల్స్ లేవని తెలిసింది. దీంతో.. దీపిక, రకుల్ పరారీలో ఉన్నారా ? అనే ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో కాలికి తగిలిన తీగ ఈ డ్రగ్స్ కేసు. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు 17 మందిని అరెస్ట్ చేశారు. వీరు విచారణలో షాకింగ్ విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ డ్రగ్ కేసుతో టాలీవుడ్, కన్నడ పరిశ్రమకు లింకులు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.