వివేకా హత్యకేసు.. ఈ మున్నా ఎవరు ?
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ వేగం పెంచింది. గత రెండ్రోజులుగా సీబీఐ అధికారులు పులివెందులలోనే ఉంటూ విచారణ కొనసాగిస్తున్నారు. కడప జిల్లా పులివెందులకు చెందిన మున్నా, అతని కుటుంబసభ్యులను విచారించారు.
పులివెందులలో చెప్పుల దుకాణం నిర్వహించే మున్నాకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు లాకర్లో రూ.48లక్షల నగదు, 25 తులాల బంగారం ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
మున్నాకు ఎంత డబ్బు ఎక్కడిది ? ఎలా వచ్చింది ?? ఆరా తీస్తున్నారు సీబీఐ అధికారులు. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో ఓ బృందం మున్నా స్నేహితులు, సన్నిహితులను విచారిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. గతంలో మున్నా ఫ్యామిలీ విషయాల్లో వివేకా తలదూర్చినట్టు సీబీఐ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. మున్నాకు ఇద్దరు భార్యలు.. ఆయన ఫ్యామిలీ గొడవలు వివేకా దగ్గరికి రావడంతో.. గట్టిగా బుద్ది చెప్పినట్టు తెలుస్తోంది. ఆ కోణంలో కూడా సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తొంది.