TSలో 2,381 కొత్త కేసులు, 10 మరణాలు, 2,021 రికవరీ !
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,381 కొత్త కేసులు నమోదయ్యాయ్. మరో పది మంది కరోనాతో మృతి చెందారు. నిన్న ఒక్క రోజే 2,021 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ప్రస్తుతం తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,81,627కి చేరింది. మృతుల సంఖ్య 1080కి చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1,50,160 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,382 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 24,592 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు ప్రతిరోజూ 50వేల టెస్టులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఇదే విషయాన్ని హైకోర్టుకు చెప్పింది. అయితే ఇటీవల కాలంలో ఓ రోజు ఎక్కువగా, ఓ రోజు తక్కువగా కరోనా టెస్టులు చేస్తున్నారు. దీనిపై గురువారం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ప్రభుత్వం ఎందుకు ఎక్కువ టెస్టులు చేయడం లేదు. ఇందులో ఉన్న ఇబ్బందులేంటీ ?? అని ప్రశ్నించింది. ఆసుపత్రుల్లో బెడ్ ల సంఖ్యపై కూడా హైకోర్ట్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనిపై వచ్చే నెల 6న జరగనున్న విచారణలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.