‘ఆచార్య’లో చరణ్.. వెనక అమ్మ కల !
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇందులో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ పాత్ర వెనక అమ్మ కల ఉందని చెప్పారు చరణ్. తండ్రి-కొడుకు చిరు-చరణ్ ఓ ఆంగ్ల ప్రత్యేకకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ఆచార్య’ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘నేను నాన్న కలిసి తెరపై పూర్తి స్థాయిలో కనిపించాలని మా అమ్మ కల. ‘ఆచార్య’లో మా కాంబినేషన్ అలరిస్తుందని నమ్ముతున్నా. 2015లో నేను నటించిన బ్రూస్ లీ చిత్రంలో నాన్న ప్రత్యేక పాత్రలో నటించారు. ఖైది నెంబర్ 150లో నేను నాన్నతో కలిసి డాన్స్ చేశా. ఇప్పుడు మళ్ళీ ఆచార్యలో కలిసి నటిస్తున్నాం’ అని చరణ్ వెల్లడించాడు.
‘నేను చరణ్ కలిసి నటించడం నా భార్య సురేఖ కోరిక. ఆచార్య లాంటి కథ మళ్ళీ దొరుకుతుందో లేదో అని.. ఆ పాత్రలో చరణ్ నటిస్తే బాగుంటుందని అనుకున్నాం. దీనితో చరణ్ తో RRR తీస్తున్న రాజమౌళిని రిక్వెస్ట్ చేసి మరి డేట్స్ అడ్జెస్ట్ చేశాం. ఆచార్య షూటింగ్ వచ్చే ఏప్రిల్ కు పూర్తి అవుతుంది’ అని చిరు తెలిపారు. వచ్చే నెలలోనే ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. రామ్ చరణ్ పాత్రని పూర్తి చేయనున్నారు. చరణ్ కు జంటగా రష్మిక మందన కనిపించబోతుందని తెలుస్తోంది.