బాలు ఆరోగ్యం.. అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు !
గాన గాంధర్వుడు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషయమించింది. ఏ క్షణాన ఎలాంటి వార్తైనా రావొచ్చని చెబుతున్నారు. ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు బాలు తనయుడు ఎస్పీ చరణ్ ని పిలిచి పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. ఆసుపత్రి వద్దకు బాలు కుటుంబసభ్యులు, బంధువులు చేరుకుంటున్నారు.
తమిళ సినీ దర్శకనిర్మాత భారతీరాజా కూడా ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంచలన ప్రకటన చేశారు. బాలు కోలుకోవాలని తాము చేసిన ప్రార్థనలు ఫలించలేదని అన్నారు. బాలు ఆరోగ్యం చాలా విషమంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయనను చూడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాలుపై ఇక ఆశలు లేవనే విషయం అర్థమవుతోంది.
మరోవైపు బాలు హెల్త్ బెలిటెన్ ఇంకా రాకపోవడం అభిమానులు ఆందోళనకి గురవుతున్నారు. అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు ఆసుపత్రి ఆవరణలో భద్రతని పెంచారు. పోలీసులని మోహరించారు అయితే దేవుడు కరుణించి బాలుని బతికించాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇక చేసేదేమీ లేదు. దేవుడిపై భారం వేయడం తప్పా అని తెలుస్తోంది.