ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్న శ్రద్దా కపూర్
డ్రగ్స్ కేసులో ఈరోజు ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రదా కపూర్, సారా అలీఖాన్ లని విచారిస్తున్నారు. ఈ ఉదయం 10 గంటలకే దీపికా పదుకొనె ఎన్ సీబీ కార్యాలయానికి చేరుకుంది. ముంబైలోని కొలాబాలోని అపోలో బండర్లో ఎవెలిన్ గెస్ట్ హౌస్ లో దీపికని విచారిస్తున్నారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే శ్రద్దా కపూర్ కూడా ఎన్ సీబీ ఆఫీసుకు చేరుకుంది. శ్రద్దాని బల్లార్డ్ ఎస్టేట్లోని ఎన్సీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు. విచారణలో వీరు ఎలాంటి సంచలన విషయాలని బయటపెడతారు అన్నది ఆసక్తిగా మారింది.
ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ నిన్న ఎన్ సీబీ విచారణకు హాజరైంది. విచారణలో రకుల్ మరో నలుగురు పేర్లని బయటపెట్టినట్టు సమాచారమ్. అంతేకాదు.. తనకి డ్రగ్స్ తీసుకొనే అలవాటు లేదు. కానీ రియా డ్రగ్స్ ని తీసుకొచ్చే తన ఇంట్లో దాచిపెట్టేది అని చెప్పినట్టు సమాచారమ్. ఈ కేసులో నోటీసులు అందుకున్న మరో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ కూడా ఈరోజే ఎన్ సీబీ ముందు విచారణకు హాజరు కానుంది.
#WATCH : Actor #ShraddhaKapoor reaches Narcotics Control Bureau zonal office in Mumbai.
She has been summoned by NCB to join the investigation of a drug case, related to #SushantSinghRajputDeathCase (ANI) pic.twitter.com/AdwMWHnKYO
— TOI Mumbai (@TOIMumbai) September 26, 2020