గాన గాంధర్వుడుకి బిగ్ బాస్ ఘన నివాళి 

గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇక లేడనే విషయం ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం బాలు తుదిశ్వాస విడిచారు. ఈ ఉదయమే అంత్యక్రియలు పూర్తయ్యాయి. బాలు మృతిపట్ల తెలుగు బిగ్ బాస్ వేదికపై ఘననివాళి అర్పించారు. దీనికి సంబంధించిన ప్రోమోని స్టార్ విడుదల చేసింది. హోస్ట్ నాగార్జున వేదికపైకి వచ్చిన వెంటనే బాలుకి నివాళి అర్పించారు.  ల చేసింది.

‘ఆ స్వరం ఇక పలకదని, ఆ వరం మనకిక లేదని నాగార్జున భావోద్వేగాలతో చెప్పారు. సరిగమలు కన్నీళ్లు పెట్టాయి, రాగాలన్నీ బాధపడ్డాయి అంటూ బాలు మృతికి విచారం వ్యక్తం చేశారు. ఆయన సంగీతాన్ని గంధర్వులు తప్పక ఆస్వాదిస్తుంటారని కచ్చితంగా చెప్పగలను’ అంటూ నాగ్ నివాళి అర్పించారు. ప్రోమో చూస్తే బాలు అభిమానులు సైతం భాగోద్వేగానికి గురయ్యేలా ఉంది.