చంద్రబాబు ఇంటికి నోటీసులు

తెదేపా అధినేత చంద్రబాబు ఇంటికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. కృష్ణా కరకట్టకు లోపల వైపు ఉన్న 36 భవనాలకు అధికారులు ఆదివారం వరద హెచ్చరిక పత్రాలను అంటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి కూడా ఈ పత్రాన్ని రెవెన్యూ అధికారులు అతికించారు.

ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీనిక వరద నీరు పోటెత్తెతుతోంది. గంటగంటకు కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరుకోగా, ఇన్‌ఫ్లో 6.66 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉంది. ఫలితంగా నదీ పరివాహక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక, తారకరామన%