హ్యాపీ బర్త్ డే పూరి 

తిన్నట్లని కూడా స్వీట్లుగా మార్చాడు. మన హీరోలని బుల్లెట్’లా మార్చాడు. ఇక్కడ ఎవ్వడు తక్కువోడు కాదు. ఎవ్వడివాడే తోపు.. హీరో.. స్టార్ హీరో అని గుర్తు చేశాడు. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అతడు ఎవరోనని.. ఇంకేవ్వరు మన పూరి జగన్నాథ్. నేడు దర్శకుడు పూరీ పుట్టినరోజు. ఈ సందర్భంగా పూరీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.

సెప్టెంబ‌ర్ 28, 1966లో పూరి జన్మించారు. 2000లో ప్రేక్షకుల ముందుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బద్రీ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. బద్రీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. పూరి టాలెంట్ గురించి ఇండస్ట్రీకి తెలిసిపోయింది. ఆ తర్వాత ఇట్లు శ్రావ‌ణీ సుబ్ర‌మ‌ణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలతో వరుస హిట్స్ ని ఖాతాలో వేసుకొన్నారు. ట్రెండ్ సెట్ చేశాడు. స్టార్ హీరోలంతా ఒక్కసారైనా పూరి పాత్రలో మునగాలని ఆశపడ్డవారే.

ఇప్పుడున్న స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన పూరీ.. వారిని తన సినిమాల్లో భిన్నంగా చూపించగలిగాడు. మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు రామ్ చరణ్ ని ‘చిరుత’తో తెరకు పరిచయం చేసినా, ప్ర‌భాస్‌ ‘బుజ్జిగాడు’చేసినా, బాలయ్యతో ‘పైసా వసూల్’ చేసినా.. ఆ క్రెడిట్ పూరికి దక్కింది. ఇప్పుడు టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నారు.

ఇది పాన్ ఇండియా సినిమా. బాలీవుడ్ పూరికి కొత్తేమీ కాదు. పూరి చేసిన హిట్ సినిమాలన్నీ బాలీవుడ్ లోనూ హిట్ కొట్టాయ్. ఏకంగా బిగ్ బీ అమితాబ్ తో పూరి స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. పూరికి ఆకలి అలవాటే. ‘ఇస్మార్ట్ శంకర్’ ముందు వరకు ప్లాపుల్లోనే ఉన్నాడు. ఆ ఒక్క సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. పూరి పులిలాంటోడు. ఆయన ఎప్పుడు గర్జిస్తూనే ఉండాలని.. మరిన్ని సినిమాలు చేయాలి, మనల్ని అలరించాలని కోరుకుందాం.