గంగవ్వపై నెగటివ్ ప్రచారం
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో అవ్వదే హవా. గంగవ్వ దే హవా. ఆమె ఏం చేసిన ప్రేక్షకులు చూస్తారు. ఇదే బిగ్ బాస్ నమ్మకం. అందుకే ఆమె ఏమీ చేయలేదు. అసలు ఈ షోకి ఆమె సూట్ కాదని తెలిసిన బిగ్ బాస్ లోకి తీసుకున్నారు. అవ్వకి ఫిజికల్ టాస్క్స్ నుంచి మినహాయింపు కూడా ఇస్తున్నారు. అయితే దీనిపై సోషల్ మీడియా వేదికగా నెగటివ్ ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ ఇంట్లో అందరు సమానులే. అలాంటప్పుడు అవ్వకు మినహాయింపులు ఎందుకు ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమెకి క్రేజ్ ఉంది కాబట్టే.. రేటింగ్స్ కోసం ఇంట్లో కూర్చో బెడుతున్నారు. అవ్వ వలన ఇతరులు బలవుతున్నారు. ఎలిమినేట్ అవుతున్నారన్నది వారి వాదన.
వారి వాదనలో నిజం లేకపోలేదు. కానీ, ఇంట్లో ఏమీ చేసినా.. చేయకపోయినా.. వారికి ఓట్లు వేసే ఇష్టం మాత్రం ప్రేక్షకులదే. వారు ఓట్లు వేస్తేనే ఇంట్లో ఉంటారు. ఈ యాంగిల్ లో గంగవ్వ టాప్ లో ఉన్నారు. అలాంటప్పుడు అవ్వ వలన ఇతరులు బలవుతున్నారనే పిచ్చి ప్రచారంలో అర్థం లేదెమో. అవ్వ గురించి అన్నీ తెలిసే బిగ్ బాస్ ఇంట్లోకి తీసుకున్నారు. అన్నీ తెలిసే ప్రేక్షకులు అవ్వకు ఓట్లు వేస్తున్నారు. అలాంటప్పుడు అవ్వపై నెగటివ్ ప్రచారం ఎందుకు ? అన్నది నా లాంటి అవ్వ అభిమానుల అభిప్రాయం.