కాజల్ బ్లాక్ స్ట్రోక్
చందమామ కాజల్ మరోసారి అందాల స్ట్రోక్ ఇచ్చింది. బ్లాక్ డ్రగ్స్ లో దిగిన ఫోటోలని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. “I love black because it affirms, designs and styles. A woman in a black dress is a pencil stroke” – Yves Saint Laurent అంటూ కోడ్ చేసింది. నిజంగా బ్లాక్ డ్రెస్ లో కాజల్ ఖతర్నాక్ గా ఉంది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ బ్లాక్ అందాలని నెటిజన్స్ ఆస్వాదిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కాజల్ ఆచార్య, భారతీయుడు 2 చిత్రాల్లో నటిస్తోంది. కరోనా విజృంభణతో ఈ రెండు చిత్రాల షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఆచార్య షూటింగ్ మొదలు కానుంది. కానీ ఆ షెడ్యూల్ కాజల్ అవసరం లేదని తెలుస్తోంది. రామ్ చరణ్ పార్ట్ ని పూర్తి చేయనున్నారు. ఆయనకి జంటగా నటిస్తున్న రష్మిక మందన కూడా షూటింగ్ లో పాల్గొననుంది. ఇక కాజల్ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు మొగుడి కోసం వేటలో ఉంది. సరిజోడు దొరికితే పెళ్లిచేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది.
“I love black because it affirms, designs and styles. A woman in a black dress is a pencil stroke.” — Yves Saint Laurent pic.twitter.com/9b4TU3LYhE
— Kajal Aggarwal (@MsKajalAggarwal) September 28, 2020