సీఎం జగన్’కు సినీ ప్రశంసలు

ఏపీ సీఎం జగన్ కు సినీ ప్రముఖులు థాంక్స్ చెబుతున్నారు. గాన గాంధర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యానికి భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించాల‌ని కోరుతూ భార‌త‌ప్ర‌ధానికి ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇది వ‌ర‌కూ దేశంలో ప‌లువురు గాయ‌కుల‌కు, సంగీత కారుల‌కు భార‌త‌ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించిన సంద‌ర్భాలున్నాయని జ‌గ‌న్ ప్ర‌ధానికి రాసిన లేఖ‌లో ప్రస్తావించారు. ల‌తా మంగేష్క‌ర్ వంటి సినీ గాయ‌నికి కూడా కేంద్రం ఇది వ‌ర‌కే భార‌త‌ర‌త్న‌ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. ఇక శాస్త్రీయ సంగీత విద్వాంసుల‌కూ అలాంటి ఖ్యాతి ద‌క్కింది. బాలు కూడా అందరుకు అర్హుడు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని సీఎం జగన్ ప్రధానికి విజ్ఝప్తి చేశారు.

ఇప్పటికే సినీ పరిశ్రమ నుంచి బాలుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. రాజ‌కీయంగా కూడా ఒక ప్ర‌తిపాద‌న అవ‌స‌రం కాబ‌ట్టి.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న వంతుగా లేఖ‌ను రాశారు. దీంతో సీఎం జగన్ పై సినీ పరిశ్రమ ప్రశంసలు కురిపిస్తోంది. నటుడు కమల్ హాసన్ సీఎం జ‌గ‌న్ కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. తెలుగు, తమిళ, మలయాళ పరిశ్రమ బాలుకు భారతరత్న ఇవ్వాలని కోరుతున్నాయి. సీఎం జగన్ ప్రధానికి లేఖ రాయడంతో.. వారికి పొలిటికల్ సపోర్ట్ కూడా తోడైనట్టయింది. మరీ.. బాలుకు భారతరత్నపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? అన్నది చూడాలి.