సూపర్ హీరోలు.. వీరే !


ఐపీఎల్ లో నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు సూపర్ విన్ అయింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. డివిలియర్స్ (55; 24 బంతుల్లో 4×4, 4×6), శివమ్‌దూబె (27; 9 బంతుల్లో, 1×4, 3×6), పడిక్కల్ (54; 40బంతుల్లో 5×4, 2×6), ఆరోన్‌ ఫించ్ (52; 35 బంతుల్లో 7×4, 1×6) రాణించారు.  202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ముంబై ఒక వికెట్ కోల్పోయి 7 పరుగులు మాత్రమే చేసింది. ఈ 8 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఈజీగానే చేధింది సూపర్ విజయాన్ని నమోదు చేసింది.

ఈ సూపర్ మ్యాచ్ లో సూపర్ విజేతలు మాత్రం.. ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో, 2×4, 9×6), కీరన్‌ పొలార్డ్‌ (56; 23 బంతుల్లో 2×4, 5×6), బెంగళూరు బౌలర్ సైని అని చెప్పాలి. ముంబయి తొలుత 15 ఓవర్లకు 112/4తో నిలవడంతో అసలు గెలుస్తుందా అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే, చివరి ఐదు ఓవర్లలో ఇషాన్‌ కిషన్‌, కీరన్‌ పొలార్డ్‌ రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ 30 బంతుల్లో 89 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టైగా మారింది. ఇక సూపర్ ఓ వర్ లో సైని అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పోలార్డ్, హార్థిక్ పాండ్యాలని ఇబ్బందిపెడుతూ.. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బెంగళూరు విజయాన్ని ఖాయం చేశాడు. అందుకే.. ఈ ముగ్గురు సూపర్ హీరోలుగా చెప్పవచ్చు.