రకుల్ పిటిషన్ : కేంద్రానికి కోర్ట్ నోటీసులు 

డ్రగ్స్ కేసులో తన పేరుని ప్రచారం చేయడంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్‌ కేసులో తనపై కథనాలు రాయకుండా/ప్రసారం చేయకుండా మీడియాకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోరారు. అలాంటి వార్తల వల్ల తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) విచారణ పూర్తి చేసి, నివేదికను తయారు చేసేంత వరకు తన పేరును ప్రస్తావించకూడదని ఆమె కోరారు. ఈ నేపథ్యంలో రకుల్‌ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. కేంద్ర ప్రభుత్వం, మీడియా నియంత్రణ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు డ్రగ్స్ కేసులో ఎన్ సీబీ నుంచి రకుల్ కు నోటీసులు జారీకావడం.. ఆమె విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.