బాలీవుడ్ డ్రగ్ కేసు : టాలీవుడ్ నటీనటులకి ఎన్ సీబీ నోటీసులు
ఊహించినదే జరుగుతోంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో టాలీవుడ్ కు లింకు ఉంది. పలువురు టాలీవుడ్ ప్రముఖులకి ఎన్ సీబీ నోటీసులు జారీ చేయబోతుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ ప్రచారమే నిజం కాబోతున్నట్టు సమాచారమ్. ఈ కేసులో టాలీవుడ్ కి చెందిన నలుగురు హీరోయిన్స్, నలుగురు హీరోలకి నోటీసులు అందబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే ఎన్ సీబీ అధికారులు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. విచారణలో వీరు చెప్పిన విషయాల ఆధారంగా మరికొందరు సినీ ప్రముఖులకి నోటీసులు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ జాబితాలో ముగ్గురు బాలీవుడ్ నటులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్టు సమాచారమ్. నాలుగేళ్ల క్రితమే టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం బయటకొచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ డ్రగ్స్ కేసులో పాత కేసు మళ్లీ తెరపైకి రానుంది. పాత కేసుతో తాజా బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు లింకులు ఉన్నట్టు చెబుతున్నారు.