తొలి విజయంపై వార్నర్ హ్యాపీ
ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బోణి కొట్టింది. నిన్న జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ని 15 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ తో మునుపటి హైదరాబాద్ జట్టు కనిపించింది. హైదరాబాద్ జట్టు భారీ స్కోర్లు ఏమీ చేయదు. చేసిన స్కోరుని మాత్రం సమిష్టిశ్రమతో కాపాడుకుంటుంది. నిన్నటి మ్యాచ్ లోనూ అదే జరిగింది. తొలి విజయంపై హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సంతోషం వ్యక్తం చేశారు. టాస్ ఓడినా మ్యాచ్ గెలవడంపై హ్యాపీగా ఉందన్నారు.
‘టాస్ ఓడినా మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. దురదృష్టవశాత్తు మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. ఓవర్ల కోటాను ఎలా పూర్తిచేయాలా అని మథన పడుతున్నప్పుడు అభిషేక్ శర్మ వచ్చాడు. డెత్ బౌలింగ్ విషయంలో మేమెంతగానో శ్రమించాం. అందుకే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాం. ప్రతి దశలోనూ మా బౌలర్లు వికెట్లు తీశారు. బ్యాటింగ్ పరంగానూ మాకు అదృష్టం కలిసొచ్చింది. వికెట్ల మధ్య బాగా పరుగెత్తినందుకు గర్వపడుతున్నాం. కానీ ఈ వేడిలో అలా పరుగెత్తడం ఎంతో కష్టం. శారీరకంగా అలసిపోతాం. నేను కొన్ని షాట్లు బాగానే ఆడాను’ అని చెప్పుకొచ్చారు.