రివ్యూ : భాగమతి

చిత్రం : భాగమతి (2018)
నటీనటులు : అనుష్క, ఉన్నిముకుంద‌న్
సంగీతం : థ‌మ‌న్
ద‌ర్శ‌కత్వం : జి. అశోక్
నిర్మాత‌లు : వంశీ, ప్ర‌మోద్
రిలీజ్ డేట్ : 26 జనవరి, 2018.

సరైన కథ పడాలే కానీ స్వీటీ అనుష్క నట విశ్వరూపాన్ని చూపిస్తుంది. నటనలోజేజమ్మని చూపిస్తుంది. ఇప్పటికే అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి సినిమాలో ఆ రేంజ్ నటనతో ఆకట్టుకొంది. మరోసారి ఆమె నుంచి అద్భుత నటనని ఆశించిన చిత్రం ‘భాగమతి. దీనికి కారణం ఈ చిత్ర టీజర్, ట్రైలర్స్ నే. వీటితో అనుష్క మరోసారి నట విశ్వరూపం చూపించబోతుందనే హింట్ ఇచ్చారు. జి. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భాగమతి’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ‘భాగమతి’ ఆ రేంజ్ అంచనాలని అందుకొందా ? ఇంతకీ భాగమతి కథేంటీ ?? అది ప్రేక్షకుల ని ఏ మేరకు ఆకట్టుకొంది ??? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

చంచల (అనుష్క) ఐఎఎస్ అధికారిణి. నిజాయితీ, నిబద్దత కలిగిన రాజకీయ నాయకుడు, అధికార పార్టీ నేత ఈశ్వ‌ర ప్ర‌సాద్ దగ్గర ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీగా ప‌ని చేస్తూ ఉంటుంది. సొంత పార్టీలోనే ఈశ్వర ప్రసాద్ ఎదుగుదలపై అసంతృప్తి నెలకొంటుంది. భవిష్యత్ లో.. ఆయన ప్రధాని అభ్యర్థి పదవికి పోటీగా వస్తాడని ఊహించి.. ఆయనకు చెక్ పెట్టడానికి ప్లాన్ చేస్తారు. ఆ బాధ్యతలని సిబిఐ జాయింట్ డైరెక్ట‌ర్ వైష్ట‌వి న‌ట‌రాజ‌న్(ఆశా శ‌ర‌త్ )కు అప్ప‌గిస్తారు.

ఈశ్వర ప్రసాద్ పై దాడి చేయాలంటే ఆయన లూప్ హోల్స్ తెలియాలి. అవి తెలియాలంటే మొదట చంచల నుంచి విచారణ మొదలెట్టాలని వైష్ణవి డిసైడ్ అవుతోంది. ఇంతలో అనూహ్యంగా చంచ‌ల త‌న ప్రియుడు (ఉన్ని కృష్ణ‌న్)ను హ‌త్య చేసిన కేసులో అరెస్టై జైలులో ఉంటుంది. దీంతో.. సీబీఐ టీం విచారణ కోసం చంచలని ఊరికి దూరంగా అడవిలో ఉన్న భాగమతి బంగ్లాకి తీసుకెళుతుంది. అక్కడికి వెళ్లాక చంచల వింతగా ప్రవర్థిస్తుంటుంది. తాను భాగ‌మ‌తిని అంటూ సిబిఐ అధికారుల‌ను భ‌య‌పెడుతుంది. దీనిపై లోతుగా వైష్ణవి లోతుగా పరిశీలన చేస్తుంది. ఆ పరిశీనలో ఏం తేలింది ? చంచ‌ల స్వ‌యంగా త‌న ప్రియుడిని హ‌త్య చేసిందా..?? అనేది మిగితా కథ.

ఎవరెలా చేశారంటే ?
స్వీటీ అనుష్కని దర్శకుడు రెండు కోణాల్లో చూప‌డంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. టేకింగ్‌, థ్రిల్లింగ్‌ విజువల్స్‌లో ఆడియన్స్‌ను కట్టి పడేశాడు. బంగ్లా ఏపీసోడ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. మొత్తంగా దర్శకుడిగా అశోక్ సక్సెస్ అయ్యారు.

అనుష్క వన్ ఉమెన్ షో ఇది. ఐఎఎస్ అధికారిణి ‘చెంచల’గా హుందాగా కనిపించిన అనుష్క, భాగమతిగా రౌద్ర రసాన్ని అద్భుతంగా పలికించింది. బంగ్లా సన్నివేశాలో మరోసారి అరుంధతిని గుర‍్తు చేసింది. కేవలం అనుష్క కోసమే రాసిన కథగా అనిపించింది. రౌద్ర రసం పండించడం స్వీటీకి కొట్టిన పిండి. అందుకే బంగ్లా ఏపీసోడ్ మహాద్భుతంగా వచ్చింది.

మినిస్టర్‌ ఈశ్వర్‌ ప‍్రసాద్’గా జయరామ్‌ నటన బాగుంది. అనుష్క ప్రియుడు పాత్రలో నటించిన ఉన్నిముకుందన్ పాత్ర చిన్నదే. ఆ పాత్రలో చక్కగా నటించాడు. సిబిఐ అధికారిణి పాత్ర‌లో ఆశా శరత్‌ నటన బాగుంది. మిగితా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :
సెకాంఢాప్ లో సినిమాని కొంచెం సాగదీసినట్టు అనిపించింది. ఐతే, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్ర్లే లో ఈ లోపం లోపంగా అనిపించలేదు. మది సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనిపించింది. థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని ఓ మెట్టు ఎక్కిందింది. ఎడిటింగ్ ఓకే. సెకాంఢాఫ్ లో ఒకట్రెండు సీన్స్ కత్తెర పెట్టవచ్చు. యువి క్రియేష‌న్స్ నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

బాటమ్ లైన్ : భాగమతి.. మరోసారి జేజమ్మ కనిపించింది

రేటింగ్ : 3.75/5