వైరల్ : మాళవిక నాయర్ కొత్త ఫోటోలు

‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో తెలుగు తెరకుపరిచయం అయింది మాళవిక నాయర్. ఆ తర్వాత కల్యాణ వైభగమే, మహానటి, విజేత, టాక్సీవాలా, నిన్ను వీడని నీడను నేనే సినిమాల్లో నటించింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘ఓరేయ్ బుజ్జిగా’. రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండా రూపొందించిన చిత్రమిది. హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటించింది. అక్టోబర్ 2న ఈ సినిమా ఓటీటీ (ఆహా)లో రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్ లో ఓరేయ్ బుజ్జిగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నిర్వహించారు. ఈ వేడుకకి బ్లాక్ డ్రెస్ ధరించి హాజరైన మాళవిక అందరి చూపులని తనవైపుకి తిప్పుకుంది. బబ్లీగా ఉండే మాళవికా బాగా బక్కచిక్కింది. నాజుక్కగా రెడీ అయింది. ఆమె కొత్త ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలని మీరు ఓ సారి చూసేయండీ..!

ఇక ఓరెయ్ బుజ్జిగా కామెడీ ఓవర్ డోస్ గా ఉంటుందని దర్శకుడు విజయ్ కుమార్ కొండా అన్నారు. ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుంది. థియేటర్స్ లో ఆ నవ్వులని చూడాలని ఆశపడ్డాం. కానీ కుదరలేదు. ఇంట్లో సినిమా చూసిన తాము చెప్పిన మాటలు గుర్తుకొస్తాయన్నారు. పైరసీని ఎంకరేజ్ చేయవద్దని కోరారు.