‘ఆదిపురుష్’పై స్వీటీ స్పందన


బాహుబలి ప్రభాస్ నటించనున్న స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామాయణం యుద్దకాండ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందట. దాదాపు వెయ్యికోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. 

రామాయణ యుద్ధకాండగా ఆదిపురుష్ తెరకెక్కనుంది. ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణాసురుడి పాత్ర కోసం సైఫ్ అలీఖాన్ ని తీసుకొన్నారు. మరీ.. సీత ఎవరు ? అనే చర్చ మొదలైన వెంటనే స్వీటీ అనుష్క పేరు తెరపైకి వచ్చింది. ఎప్పుడైతే సీత పాత్ర కోసం అనుష్క పేరు ప‌రిశీలిస్తున్నార‌న్న వార్త వ‌చ్చిందో – అప్పుడే ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్లు కూడా మొద‌లైపోయాయి.

తాజాగా నిశ్శబ్ధం ప్రమోషన్స్ లో పాల్గొన్న అనుష్క ఆదిపురుష్ పై క్లారిటీ ఇచ్చింది. ఆదిపురుష్ ప్రాజెక్టులో న‌టించ‌మ‌ని నన్నెవ‌రూ అడ‌గ‌లేదు. అలాంటి ప్ర‌తిపాద‌న ఏదీ త‌న ద‌గ్గ‌ర‌కు రాలేద‌ని క్లారిటీ ఇచ్చేసింది. తాను తెలుగులో రెండు కొత్త సినిమాల్ని ఒప్పుకున్నాన‌ని, అందులో ఆదిపురుష్ లేద‌ని స్ప‌ష్టం చేసింది.