లాయర్.. దొంగ.. పోలీస్.. !

టైటిల్ చూస్తే పవర్ స్టార్ పవన్ కల్యణ్ గుర్తొస్తున్నారు కదా ! నిజమే.. ఇవన్నీ పవన్ పాత్రలే. వకీల్ సాబ్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ లో పవన్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక క్రిష్ సినిమాలో దొంగ పాత్రలో కనిపిస్తారు. పెద్దలని దోచి పేదలకు పంచిపెట్టే పాత్ర అదని చెబుతున్నారు. ఇక హరీశ్ శంకర్ సినిమాలో పవన్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. గబ్బర్ సింగ్ తరహా నాకు తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది అనే టైపు పోలీస్ పాత్రలో కనిపిస్తారట.

సురేందర్ రెడ్డి సినిమాలో పవన్ పాత్ర ఏంటీ ? అన్నది ఇంకా తెలియదు. కానీ బండ్ల గణేష్ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఇందులో పెద్దంటి లో అన్న లాంటి ఫ్యామిలీ క్యారెక్టర్ వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ పూర్తి చేసే లోపు 2023 ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి. అప్పుడు రియల్ పొలిటిషన్ పాత్రలోకి పవన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అప్పటి వరకు వీలైనన్నీ పాత్రల్లో పవన్ కనిపించబోతున్నారు అన్నమాట.