అన్ లాక్ 5 గైడ్ లైన్స్ : థియేటర్స్, స్కూల్స్.. అన్నీ ఓపెన్ !

ఊహించినట్టే అన్ లాక్ 5లో అన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. తాజాగా అన్ లాక్ 5 గైడ్ లైన్స్ ని కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసింది. థియేటర్స్, స్కూల్స్.. అన్నీంటికి అనుమతులు ఇచ్చింది.

అన్ లాక్ 5 గైడ్ లైన్స్ :

* ఈ నెల 15 నుంచి సినిమా థియేటర్లు/ మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌

* 50 శాతం సీట్ల సామర్థ్యంతో తెరిచేందుకు అనుమతిచ్చింది

* అక్టోబర్‌ 15 నుంచి స్కూళ్లు తెరుచుకోవచ్చని, ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టింది

* 15 నుంచి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఎగ్జిబిషన్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు తెరుచుకోవచ్చు

* క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్‌ పూల్స్‌ తెరుచుకోవచ్చు.

* కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం అక్టోబర్‌ 31 వరకు లాక్‌డౌన్‌ యథాతథం

*  ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగించుకోవచ్చు

* పిల్లల్ని పంపే అంశంపై తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి తప్పనిసరి\

* విద్యాసంస్థలు తెరిచే విషయంలో రాష్ట్రాలు సొంత మార్గదర్శకాలు రూపొందించుకోవాలి

*  కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని ఉన్నత విభాగాలకు అప్పగింత