పెళ్లి కూతురు లుక్ కోసం మెగా హీరోయిన్ కసరత్తులు


మెగా హీరోయిన్ నిహారిక పెళ్లి ఫిక్సయిన సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్యతో నిశ్చార్థం కూడా జరిగిపోయింది. త్వరలోనే పెళ్లి వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో నిహారిక ఫెట్నెస్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆమె ఎక్కువగా జిమ్ లో గడుపుతున్నారు. కాస్త లావు తగ్గి.. మరింత అందంగా తయారయ్యే పనిలో ఉంది. తాజాగా నిహారిక జిమ్ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో నిహారికతో పాటుగా సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి కూడా ఉన్నారు. వీరిద్దరు కలిసి ఒకే జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్నట్టున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. హీరోయిన్ గా ఎంట్రీ  ఇవ్వకముందే.. ఆ రేంజ్ క్రేజ్ నిహారిక సొంతం. షార్ట్ ఫిల్మ్స్ తో క్రేజ్ సంపాదించుకుంది. ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. సూర్యకాంతం, హ్యాపీ వెడ్దింగ్ సినిమాల్లో నటించారు. కానీ హిట్ కొట్టలేకపోయారు. ఆ ప్రయత్నాల్లో ఉందగానే పెళ్లి ఫిక్సయింది. పెళ్లి తర్వాత నిహారిక హీరోయిన్ గా చేసే ఛాన్సే లేదని తెలుస్తోంది. కానీ షార్ట్ ఫిల్స్, వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.