రాజస్థాన్ ఓటమికి కారణమిదే !

ఐపీఎల్ లో భాగంగా నిన్న కోల్ కతా-రాజస్థాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ వార్ వన్ సైడ్ అయింది. కోల్ కతా ఈజీగా గెలిచేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (47, 34 బంతుల్లో; 5×4, 1×6), మోర్గాన్‌ (34*: 23 బంతుల్లో; 1×4, 2×6) మెరిశారు.

175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. టామ్‌ కరన్‌ (54, 36 బంతుల్లో; 2×4, 3×6) అర్ధశతకం సాధించాడు. బట్లర్ (21, 16 బంతుల్లో; 1×4, 2×6), సారథి స్మిత్ (3; 7 బంతుల్లో), సంజు శాంసన్‌ (8; 9 బంతుల్లో; 1×6), రాబిన్ ఉతప్ప (2; 7 బంతుల్లో), రియాన్ పరాగ్‌ (1; 6 బంతుల్లో), రాహుల్ తెవాతియా (14; 10 బంతుల్లో; 1×6), శ్రేయస్ గోపాల్ (5; 7 బంతుల్లో), జోఫ్రా ఆర్చర్‌ (6; 4 బంతుల్లో; 1×6) పరుగులు చేశారు.

రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ ఆర్డర్ లో కూర్పని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఓపెనర్ గా మంచి అనుభవం ఉన్న ఉతప్ప టాప్ ఆర్డర్ లో రాణించడం లేదు. అతడిని బడ్లర్ కి జోడీ చేసి.. ఫస్ట్ డౌన్ లో  సంజూ, సెకండ్ డౌన్ లో స్మిత్ వస్తే బాగుండేది. పైగా నిన్నటి మ్యాచ్ లో అందరు చెత్త షాట్స్ ఆడి వికెట్లు పోగొట్టుకున్నారు. స్మిత్ అయితే.. ప్రతి బంతిని సిక్సర్ కొట్టాలనే తపనతో కనిపించాడు. సంజూ అంతే.. క్రీజు కాస్త కుదురుకున్నాక బ్యాట్ ఝులిపిస్తే బాగుండేది.