‘ఇంటిలిజెంట్‌’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు.. ఎక్కడ ?

దర్శకుడు వి.వి. వినాయక్ మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజుని “ఇంటిలిజెంట్” చూపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై అంచనాలని పెంచేశాయి. దీంతో.. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘ఇంటిలిజెంట్’ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే, ఈలోగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. ఫిబ్ర‌వ‌రి 4వ తేదిన రాజ‌మండ్రిలో రాజమండ్రిలో ‘ఇంటిలిజెంట్’ ప్రీ-రిలీజ్ వేడుకని నిర్వహించబోతున్నారు.

బాలకృష్ణ చేతుల మీదుగా విడుదల చేయబడిన ఈ సినిమా టీజర్ ప్రశంసలు అందుకొంటోంది. సినిమాలో హీరో పాత్రను పరిచయం చేస్తూ టీజర్ ని కట్ చేశారు. ‘ఇకపై పేదోడికి ఫ్లాట్ ఫాం .. ద‌ర్మాభాయి డాట్ కాం’ అంటూ తేజు చెప్పే డైలాగ్ బాగా పేలింది. ‘ఖైదీ నెం. 150’ తర్వాత వినాయక్ చేసిన సినిమా ఇది. దీంతో ప్రేక్షకుల్లో ఆ రేంజ్ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి సంగీతం థమన్. సి. కళ్యాణ్ నిర్మాత.