వర్మ ‘జీఎస్టీ’ని మహిళలు ఎంజాయ్ చేస్తున్నారు.. !

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ టాప్ పోర్న్ స్టార్ మియా మాల్కావోతో రూపొందించిన “గాడ్, సెక్స్ అండ్ ట్రూత్” (జీఎస్టీ) రిలీజ్ కి ముందే వివాదాల్లో చిక్కుకొంది. దీనిపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. ఐతే, తీవ్ర నిరసనల మధ్య వర్మ ‘జీఎస్టీ’ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పుడీ సినిమాని మహిళలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు వర్మ తనకు మహిళల నుంచిన ట్విట్స్ ని రీ-ట్వీట్ చేసి చూపించారు.

.”సినిమాలో ప్ర‌తి స‌న్నివేశం నాకు వ‌ణుకు తెప్పించింది. అది బూతు సినిమా కాదు.. ఫిలాస‌ఫీ కూడా కాదు… మ‌హిళ శ‌రీరాన్ని, శృంగారాన్ని ప‌విత్ర‌మైన ప‌ద్ధ‌తిలో ఆరాధించ‌డం. ఈ సినిమాను ప్ర‌తి మ‌హిళ శిరోధార్యంగా భావించాలి”

“ఓ బాలికగా స‌మాజ విధానాల అణ‌చివేత‌కు నేను గుర‌య్యాను. కానీ జీఎస్టీ చూసిన త‌ర్వాత దేవుడు న‌న్ను మ‌హిళ‌గా పుట్టించినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. మ‌హిళ శృంగార స్వేచ్ఛ గురించి చెప్పిన విధానం నాకు న‌చ్చింది. నా శృంగార హ‌క్కుల గురించి మ‌రోసారి ఆలోచించేలా చేసింది. వ‌ర్మ‌కి, మియా మాల్కోవాకి ధ‌న్య‌వాదాలు”

అంటూ తనకు మహిళలు ట్విట్స్ చేశారంటూ వర్మ చెప్పుకొచ్చాడు. తాను తీసిన పోర్న్ షార్ట్ ఫిల్మ్ ని మహిళలు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి వర్మ ఖుషి అయిపోతున్నాడు. ఇక, ఈ సినిమాని చూసేందుకు మగజాతి మక్కువ చూపిస్తోంది.