బ్రేకింగ్ : డొనాల్డ్ ట్రంప్’కు కరోనా

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోలేకపోయారు. తాజాగా ఆయనకి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్రంప్ ట్విట్ చేశారు. ట్రంప్ తో పాటు ఆయన సతీమణి మెలానియాకు  కూడా కరోనా సోకింది. తాము క్వారంటైన్ లోకి వెళ్లాం. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ట్రంప్ తెలిపారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్ కరోనా బారినపడటం పెద్ద దెబ్బే అని చెప్పాలి. కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ యూనివర్సిటీలో జరిగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో రిపబ్లిక్‌ అభ్యర్ది డొనాల్డ్ ‌ట్రంప్‌, డెమొక్రాటిక్‌ అభ్యర్ధి జో బిడెన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో భాగంగా ట్రంప్ భారత్ పై కూడా ఆరోపణలు చేశారు. కరోనా విషయంలో భారత్ తప్పుడు లెక్కలు చూపిస్తుందని ట్రంప్ ఆరోపించారు.