హెబ్బా పటేల్.. నాకిచ్చే బ్యాచ్ స్పెషలిస్ట్ !

‘కుమారి 21ఎఫ్’తో తెలుగు తెరకు పరిచయమైంది హెబ్బా పటేల్. బోల్డ్ నటనతో ఆకట్టుకుంది. అరె.. హెబ్బా హాట్ గా ఉంది. గ్లామర్ హీరోయిన్ గా దున్నేయడం ఖాయం అనుకున్నారంతా. కానీ కుమారి తర్వాత ఆమె ఖాతాలో మరో హిట్ పడలేదు. పైగా.. ఈ మధ్య ఐటమ్ స్పెషలిస్టుగా మారిపోయింది. సినిమాల్లో నాకిచ్చే పాత్రలు ఏమైనా ఉంటే.. నేరుగా హెబ్బాకు ఫోన్ కొడుతున్నారు. ఆమె కూడా హ్యాపీగా ఒప్పేసుకుంటోంది.

ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భీష్మ’లో హెబ్బా ఓ అతిథి పాత్రలో కనిపించింది. అది అతిథి పాత్ర అనడం కంటే.. ఐటమ్ పాత్ర అని చెప్పవచ్చు. డబ్బుల కోసం వచ్చే పని. కానీ ఆమె పాత్ర సినిమాని మలుపుతిప్పింది. కనిపించిన ఒకట్రెండు సీన్ లోనూ హాట్ గా కనిపించి ఆకట్టుకుంది హెబ్బా. భీష్మ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హెబ్బా హ్యాపీ. అందుకేనేమో.. అలాంటి పాత్రలోని ఏరికోరి ఎంచుకుంటోంది.

ఓరేయ్ బుజ్జిగా సినిమాలోనూ హెబ్బాది ఐటమ్ పాత్రనే. బోయ్ ఫ్రెండుని సాంతం నాకిచ్చే పాత్ర. ఇలాంటి బ్యాచ్ కోసం దర్శకుడు మంచి డైలాగులు కూడా రాశాడు. కానీ.. హెబ్బా ఇక ఇంతేనా. ఇలాంటి పాత్రలని చేసి సర్థుకోవాల్సిందేనా. మంచి అందం ఉంది. నటనలోనూ పర్వాలేదు. ఫుల్ టైమ్ హీరోయిన్ గా రాణించేది పోయి.. ఈ నాకిచ్చే బ్యాచ్ స్పెషలిస్టుగా మారడం ఏంటో అర్థం కావడం లేదని ఆమె హార్ద్ కోర్ ఫ్యాన్ అంటున్నారు.