ఎవరీ.. ఈ బుల్లి ‘సైరా’ ?

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ గెటప్’లో ఓ బుల్లి సైరా ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ బుడ్డోడు సైరా గెటప్ లో మెగాస్టార్ ని మైమరిపిస్తున్నాడు. ఎవరీ.. ఈ బుల్లీ ‘సైరా’ అని ఆరాతీస్తే ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి. ఇంతకీ బుల్లి సైరా ఎవరో తెలుసా ? దర్శకుడు సురేంధర్ రెడ్డి తనయుడు. మెగాస్టార్ సైరా కాస్టూమ్స్ పై మనసుపడిన ఈ బుడ్డోడు. తనకి అలాంటి కాస్టూమ్స్ కావాలని పట్టుబట్టాడట. దీంతో.. తనయుడు కోసం ఆ కాస్టూమ్స్ ని రెడీ చేసి.. ఇలా ఫోటోలు తీసుకొన్నాడు సురి. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక, సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా “సైరా నర్సింహారెడ్డి” తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ ఫిబ్రవరి నుంచి మొదలవ్వనుంది. ఐతే, ఈ సినిమా కోసం ‘సైరా’ లుక్ లో మెగాస్టార్ సూపర్భ్ గా ఉన్నాడు. కాస్టూమ్స్ అద్భుతంగా కుదిరాయ్. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి.. తదితరులు ‘సైరా’లో కీలక పాత్రలో కనిపించనున్నారు.