ఐపీఎల్ : చెన్నైపై హైదరాబాద్ గెలుపు
చెన్నైతో జరిగిన ఉత్కంఠ పోరులో హైదరాబాద్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోనీసేన 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది. రవీంద్ర జడేజా(50; 35 బంతుల్లో 5×4, 2×6) అర్ధశతకంతో మెరవగా చివర్లో ధోనీ(47; 36 బంతుల్లో 4×4, 1×6) ధాటిగా ఆడాడు. ఆఖరు వరకు మహేంద్ర సింగ్ ధోని (47; 36 బంతుల్లో 4×4, 1×6) క్రీజులో ఉన్న జట్టుని గెలిపించలేకపోవడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్‌ను యువ బ్యాట్స్‌మన్ ప్రియమ్‌గార్గ్ (51; 26 బంతుల్లో 6×4, 1×4) ఆదుకున్నాడు. అతడు రెచ్చిపోయి బ్యాటింగ్ చేసి టోర్నీలో తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అభిషేక్ శర్మ (31; 24 బంతుల్లో 4×4, 1×6), డేవిడ్ వార్నర్(28; 29 బంతుల్లో 3×4), మనీష్ పాండే(29; 21 బంతుల్లో 5×4)రాణించారు. దీంతో వార్నర్‌సేన నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.