హాథ్రస్‌ అత్యాచార సీబీఐకి అప్పగింత  

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్‌ అత్యాచార ఘటన కేసును సీబీఐ అప్పగించారు. ఈ మేరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రేపు సాయంత్రంలోగా ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆ బృందాన్ని ఆదేశించింది. ఈ లోపే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ సీఎం ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు బాధిత కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ప్రియాంక శనివారం సాయంత్రం పరామర్శించారు. బాధితులని పరామర్శించిన కొద్దిసేపటికే ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తూ.. యూపీ సీఎం యోగీ ట్విట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో.. ఇది రాహుల్ గాంధీ సాధించిన విజయం అనుకోవాలేమో.. !