ఎల్ఆర్ఎస్పై కేసీఆర్ ఆరా
సీఎం కేసీఆర్ శనివారం ఆరు జిల్లాల పార్టీ ప్రజాప్రతినిధులతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్పై ప్రజలు ఏమనుకుంటున్నారో నాయకుల వద్ద సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎల్ఆర్ఎస్పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సీఎంకు నేతలు తెలిపారు. వెన్యూ, మున్సిపల్ చట్టాలపై ప్రజలకున్న అపోహలను తొలగించాలని సీఎం నేతలకు సూచించారు. ఆస్తులన్నీ రికార్డుల్లోకి ఎక్కేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కేసీఆర్ చెప్పారు.
ఇక నిరుద్యోగులు, యువకులు తెరాసకు వ్యతిరేకమన్న ప్రచారం తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు. ఉద్యమకాలం నుంచి యువత అంతా తెరాసతోనే ఉన్నారని చెప్పారు. పట్టభద్రుల ఓటరు నమోదుపై నేతలు దృష్టి పెట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక సర్వేలన్నీ తెరాసకే అనుకూలంగా ఉన్నాయన్నారు. రెవెన్యూ, మున్సిపల్ చట్టాలపై ప్రజలకున్న అపోహలను తొలగించాలని సీఎం నేతలకు సూచించారు.