ఈ యేడాది జీహెచ్ఎంసీ ఎన్నికలు లేనట్టే !
నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటీఫికేషన్ రావొచ్చని మంత్రి కేటీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. అయితే అసలు ఈ యేడాదియే జీహెచ్ ఎంసీ ఎన్నికలు జరగవు. తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ తో ఆ విషయం అర్థమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 15న ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. అంటే.. జనవరి 15 తర్వాతే జీహెచ్ ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది అన్నమాట.
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ :
* 10-8-2020 నుంచి ఈనెల 31 వరకు పోలింగ్ కేం ద్రాల హేతుబద్ధీకరణ, సరిహద్దుల నిర్ధారణ
* 1-11-2020 నుంచి 15-11-2020 వరకు ఓటర్ల జాబితా ముసాయిదా తయారీ
* 16-11-2020న సమగ్ర ఓటర్ల జాబితా ప్రచురణ
* 16-11-2020 నుంచి 15-12-2020 వరకు ైక్లెములు, అభ్యంతరాల స్వీకరణ
* రెండోవ శని, ఆదివారాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమం, ైక్లెములు, అభ్యంతరాల స్వీకరణ
* 05-01-2021 వరకు అభ్యంతరాల పరిష్కారం
* 14-01-2021 డేటాబేస్ అప్డేషన్, ప్రింటింగ్
* 15-01-2021 ఓటర్ల తుది జాబితా విడుదల