అభిజిత్’కు ఐ లవ్ యూ చెప్పేసిన మోనాల్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా నాల్గో సీజన్ ని పూర్తి చేసుకోబోతుంది. అయితే వారం వారానికి బిగ్ బాస్ షో రసవత్తరంగా మారుతోంది. రొమాంటిక్ డోస్ ఎక్కువవుతోంది. మోనల్ గజ్జర్ ఒక్కరే ఇటు అభిజిత్, అటు అఖిల్ తో క్లోజ్ గా మూవ్ అవుతోంది. వారిని చూపులతో చంపేస్తోంది. చూస్తుంటే ఇద్దరితోనూ ఎఫైర్ కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో బిగ్ బాస్ ప్రేక్షకులకి కాస్త కన్ఫూజన్ ఉంది. శనివారం ఏపీసోడ్ తో ఈ కన్ఫూజన్ పూర్తిగా తేలిపోయింది. ఇప్పటికే మోనాల్ అభిజిత్ కి ఐ  లవ్ వ్యూ చెప్పేసింది. ఈ విషయాన్ని నిన్న ఇంటి సభ్యులు బయటపెట్టారు.

అదే సమయంలో ఆమె అఖిల్ తో కూడా సన్నిహితంగా ఉంటుందని చెప్పారు. అఖిల్ పడుకున్న తర్వాత అభిజిత్ దగ్గరికి వచ్చి ముచ్చట్లు పెడుతోంది. క్లోజ్ గా మూవ్ అవుతోందని చెప్పారు. దీంతో మోనాల్ డబుల్ గేమ్ ఆడుతుంది అన్న విషయం బయటపడినట్టయింది. అయితే ఈ డబుల్ గేమ్ పై నాగార్జున లోతుగా వెళ్లలేదు. బహుశా.. ఇది సమయం కాదు. దాని గురించి ప్రత్యేకంగా ఓ ఏపీసోడ్ ప్లాన్ చేసేలా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక శనివారం బిగ్ బాస్ ఇంటి నుంచి స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయ్యారు. ఈరోజు మరొకరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు సమాచారమ్.