దినేష్ కార్తీక్ మాకొద్దు.. మోర్గాన్ ముద్దు !


కోల్ కతా నైట్ రైడర్స్  కెప్టెన్ దినేష్ కార్తీక్ పై తీవ్ర విమర్శలుస్తున్నాయ్. ఆయన కెప్టెన్ గా వద్దని కోల్ కతా ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. బ్యాట్స్ మెన్ గా, కెప్టెన్ గా విఫలమవుతున్నాడని విమర్శిస్తున్నారు. బ్యాటింట్ ఆర్డర్ లో సరైనా మార్పులు చేయడం లేదు. బాగా రాణిస్తున్నా. మోర్గాన్ ని కింద పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ గా దూకుడుగా వ్యవహరించట్లేదని విమర్శిస్తున్నారు.

దినేష్ కెప్టెన్ గా వద్దు. వికెట్ కీపర్ గా ఉంటే చాలంటున్నారు. మరీ.. దినేష్ కార్తీక్ స్ఠానంలో ఎవరు అంటే.. ? ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్‌ అందించిన మోర్గాన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలంటున్నారు. బ్యాటింగ్‌తో పాటూ జట్టును ముందుండి నడిపించడంలోనూ మోర్గాన్‌ అనుభవం జట్టుకు కలిసొచ్చే అంశమే మరి.. ఆ జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.