‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మొదలైపోయింది.. !

కరోనా లాక్‌డౌన్’తో సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి షూటింగ్స్ ల్లేవ్. ఇటీవలే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకి అనుమతులు ఇచ్చినా.. పెద్ద సినిమాలేవీ సెట్స్ మీదకు వెళ్లలేదు. అయితే ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు సెట్స్ మీదకు వెళ్తున్నాయి.

తాజాగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయింది. 
ఇక్కడ చాలా చిన్ని షెడ్యూల్ ని ప్లాన్ చేశారని తెలిసిందే. కేవలం 15 రోజుల షెడ్యూల్. ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభమైన 10 రోజుల్లో ఎన్ టీఆర్ లుక్ ని విడుదల చేస్తామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజ‌మౌళి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తారక్ పై సీన్స్ చిత్రీకరిస్తున్నారు. దీంతో దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్న తారక్ ఫస్ట్ లుక్ పక్కాగా రాబోతుందని క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రంలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు.  అల్లూరిగా రామ్ చరణ్ ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, శ్రియ తదితరులు నటిస్తున్నారు. దాదాపు రూ. 400కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.