బిగ్ బాస్ హౌస్ లో ‘జంబలకిడి పంబా’ అట్టర్ ప్లాప్ !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా నాలుగు వారాలని పూర్తి చేసుకుంది. నాల్గో వారం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమె ఇప్పటి వరకు బయట కనిపించలేదు. దీంతో.. ఆమెని తిరిగి బిగ్ బాస్ ఇంట్లోకి పంపించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక బిగ్ బాస్ షో సోమ-శుక్ర ఎలా సాగినా.. శని, ఆదివారాలు నాగ్ రాకతో అదిరిపోతుంటుంది.

అయితే ఆదివారం బిగ్ బాస్ షో చప్పగా సాగింది. పగలబడి నవ్వించే ‘జంబలకిడి పంబా’ని ప్లాన్ చేశారు. ఇంట్లోని మగవాళ్లని ఆడవాళ్లుగా, ఆడవాళ్లని మగవాళ్లుగా మార్చారు. ఆఖరికి గంగవ్వని కూడా వదల్లేదు. ఆమెకు ప్యాంటు, షర్ట్ వేశారు. అయితే ఈ జంబలకిడి పంబా గెటప్ లో ఇంటి సభ్యులు చేసిన స్కిట్స్ బోర్ కొట్టించాయ్. ‘ఖుషి’ సినిమాలోని నడుం సీన్ ని ఖూని చేశారు. ఇక వాళ్ల గెటప్ లని చూసి తట్టుకోలేకపోతునాని స్వయంగా నాగ్ నే కామెంట్ చేశారు. ప్రేక్షకుల ఫీలింగ్ కూడా అదే.