గౌతమ్ కిచ్లు’ని పెళ్లాడబోతున్న కాజల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి ఫిక్సయింది. ముంబైలో స్థిరపడిన బడా బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని కాజల్ పెళ్లాడనుంది. కొన్నాళ్ల క్రిందటే వీరిద్దరి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. వీరి ప్రేమ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతేకాదు.. వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయిందట. త్వరలోనే పెళ్లి వేడుక జరగనుంది. ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజమెంత ? అనేది తెలియాలంటే.. కాజల్ నోరు తెరవాల్సిందే.
లక్ష్మీ కల్యాణం సినిమాతో కాజల్ తెలుగు తెరకుపరిచయం అయింది. చందమా సినిమాతో తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మగధీర, డార్లింగ్, మిస్టర్ ఫర్ ఫెక్ట్.. ఇలా బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆచార్య, భారతీయుడు 2 సినిమాల్లో కాజల్ నటిస్తోంది.