రియాకు పెరుగుతున్న సపోర్ట్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి అరెస్టైన సంగతి తెలిసిందే. అయితే ఆమె అమాయకురాలు. ఆమెని వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే నటి స్వరా భాస్కర్ రియాకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. రియా అమాయకురాలు, ఆమెని చిత్రహింసలు చేయకుండా వదిలేయండని ఆమె కోరారు. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి రియాకు మద్దతుగా మాట్లాడారు. రియాని జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

‘సుశాంత్‌ కేసులో ఆమెను ఇకపై చిత్రహింసలు పెట్టకుండా స్వేచ్ఛగా వదలండి. ఆయన మరణం మమ్మల్ని కూడా ఎంతో బాధించింది. కానీ ఓ మహిళను నిందితురాలిగా అభివర్ణించడంతో మనం ఆయనకి గౌరవం ఇచ్చినట్లు కాదు. రియా చక్రవర్తి అమాయకురాలని నేను ఇంతకు ముందే చెప్పాను. మరింత వేధింపులకు గురిచేయకుండా ఆమె విడుదల చేయాలి, రియా రాజకీయ కుట్రకు గురైంది’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో అధిర్‌ రంజన్‌ చౌదరి వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ స్వరా స్పందించారు. ‘చాలా బాగా చెప్పారు సర్‌.. రియా చక్రవర్తిని విడుదల చేయండి’ అని ట్వీట్‌ చేశారు.