ప్రధాని నివాసానికి చేరుకున్న సీఎం జగన్
ఢిల్లీ టూర్ లో ఉన్న ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి చేరుకున్నారు. ప్రధానితో సమావేశం కానున్నారు. ఈ భేటీలో మొత్తం 17 అంశాలని సీఎం జగన్ ప్రధాని ముందు ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ది, మూడు రాజధానులు, శాసన మండలి రద్దు, కరోనా కట్టడి అంశాలని చర్చించనున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు పోలవరం, అమరావతి భూ వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తునకి అప్పగించాలని కోరనున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఇద్దరి మధ్య రాజకీయ పరమైన చర్చ కూడా జరగనుందని చెబుతున్నారు. ఎన్ డీయే వైసీపీ చేరబోతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ప్రధాని-జగన్ మీటింగ్ తో క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ ఎన్ డీయేలో చేరితే ఆ పార్టీకి రెండు, మూడు కేంద్ర మంత్రి పదవులు దక్కవచ్చని చెబుతున్నారు.