స్మిత్’కు ఫైన్ పడింది

ఐపీఎల్ లో కెప్టెన్లకు ఫైన్స్ పడుతున్నాయి. ఈ సీజన్‌లో స్లోఓవర్‌ రేటు కారణంగా ఇప్పటికే  బెంగళూరు సారథి కోహ్లీ, దిల్లీ సారథి శ్రేయస్‌ అయ్యర్ కి జరిమానా పడిన సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్‌ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు జరిమానా పడింది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్‌ రేటు కారణంగా అతనికి జరిమానా విధిస్తున్నట్లు లీగ్‌ నిర్వాహకులు ప్రకటించారు. ఈ సీజన్‌లో కెప్టెన్‌గా స్మిత్‌ చేసిన మొదటి నేరం కాబట్టి రూ.12లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సమయం బౌలింగ్‌ చేస్తే దాన్నే ‘స్లో ఓవర్‌రేటు’ అంటారు. ఇందుకుగాను శిక్షగా ఆ జట్టు కెప్టెన్‌ మ్యాచ్‌ ఫీజులో కోత లేదా తర్వాతి మ్యాచ్‌ నుంచి నిషేధం విధిస్తారు. అబుదాబి వేదికగా మంగళవారం రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 57 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.