బిగ్ బాస్ హౌస్’లో ఆ జంట దగ్గరైంది.. ఈ జంట దూరమైంది !
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఐదోవారం రసవత్తరంగా సాగుతోంది. మోనాల్ గజ్జర్ వలలో పడిన అఖిల్.. ఆమెని దూరం పెడుతున్నాడు. బుధవారం షో భోజనం చేస్తున్న అఖిల్ ని వెనక నుంచి వచ్చిన మోనాల్ గట్టిగా హగ్ చేసుకుంది. అయితే అఖిల్ నుంచి రియాక్షన్ లేదు. ఆమె అస్సలు పట్టించుకోలేదు. తనతో ఎందుకు మాట్లాడటం లేదు. సీరియస్ గా ఎందుకున్నావ్ ? అని మోనాల్ ప్రశ్నించిన తర్వాత మాట్లాడదామని చెప్పేశాడు. దీంతో మోనాల్ సలైంట్ గా వెళ్లిపోయింది.
మరోవైపు అభిజిత్-హారిక జంట మరింత దగ్గరవుతోంది. బిబి హోటల్ టాస్క్ లో వీరిద్దరు వేరే వేరే గ్రూపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. అలా ఎందుకు చేశావ్ బిగ్ బాస్ ? మేమిద్దం ఒకే గ్రూపులో ఉంటే బాగుండు అంటూ.. అఖిల్ ని కొరికేసేలా చూపులు చూసింది హారిక. అభిజిత్ నుంచి కూడా అలాంటి రియాక్షన్ నే వచ్చిందనుకోండి. మొత్తానికి.. బిగ్ బాస్ హౌస్’ లో అభిజిత్-హారిక జంట దగ్గరైనట్టు.. అఖిల్-మోనాల్ దూరమైనట్టు కనిపిస్తోంది.
ఇక, ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, అమ్మ రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానాలు నిలిచారు. నామినేషన్స్‌లో వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు.