ఈ నెలలో స్కూల్స్ తెరిచేందుకు నో చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

అన్ లాక్ 5లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్నింటికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 15 నుంచి స్కూల్స్, థియేటర్స్ తెరచుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి స్కూల్స్ తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం నో చెప్పిది. దసరా సెలవుల తర్వాతే స్కూల్స్ తెరవడంపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

కేరళలో ఓనం పండగ తర్వాత కరోనా కేసులు పెరిగాయ్. ఈ నేపథ్యంలో దసరా పండగ తర్వాత పరిస్థితులని భట్టీ స్కూల్స్ తెరవడంపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రులు తెలిపారు. అయితే నవంబర్ 1 నుంచి ఉన్నత విద్యాకళాశాలలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఇక డిజిటల్ విద్యకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సబిత సూచించారు. మొత్తానికి.. ఈ నెలలో తెలంగాణలో విద్యాసంస్థలు తెరచుకోవడం లేదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.