ఆర్‌బీఐ.. మరోసారి కీలక వడ్డీరేట్ల యథాతథం !
ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించింది. రెపో రేటును 4శాతంగా, రివర్స్ రెపో రేటును 3.35శాతంగానే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద సరిపడా నగదు ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత శక్తికాంత దాస్ తెలిపారు.
వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచేందుకు వచ్చే వారంలో రూ. 20,000 కోట్ల మేర ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రియల్ జీడీపీ వృద్ధిరేటు 9.5శాతం వరకు తగ్గవచ్చిని అంచనా కట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశముందని అంచనా వేశారు. అప్పటికి జీడీపీ వృద్ధి రేటు కూడా పాజిటివ్ జోన్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.